రాకింగ్ స్టార్ యశ్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ టాక్సిక్. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా టాక్సిక్ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇందుకు సంబంధించిన కార్యక్రమానికి హీరోయిన్లు నయనతార, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, తారా సుతారియా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నటి రుక్మిణి వసంత చాలా ముద్దుగా కనిపించారు. క్రీమ్ కలర్ ఫ్రాక్ ధరించి సింపుల్ లుక్ లో పాలరాతి శిల్పంలా కనిపించింది. ముఖ్యంగా తన అందమైన రూపంతో ఈ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇదిలా ఉంటే.. రుక్మిణి వసంత్ ధరించిన మాంట్‌సెండ్ లేస్ మిడి డ్రెస్ ధర సుమారు రూ. 54,269 ఉంటుందని సమాచారం. అలాగే తన డ్రెస్ కు మ్యాచింగ్ గా సరిపోయే హిల్స్ ధరించింది. వాటి ధర సుమారు రూ. 4350. ఇక రుక్మిణి సింపుల్ చెవి రింగులు, చైన్, సింపుల్ మేకప్, హెయిర్ స్టైల్ తో ఈ వేడుకలో మరింత హైలెట్ అయ్యారు. ఆమెకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
టాక్సిక్ ట్రైలర్ విడుదల కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. యశ్ విభిన్న కోణాలు, తండ్రీకొడుకుల ప్రతీకార కథ, బోల్డ్ మహిళా పాత్రలు, హై-వోల్టేజ్ ఫైటింగ్ సన్నివేశాలు, గీతూ మోహన్‌దాస్ ప్రత్యేకమైన మేకింగ్ ‘టాక్సిక్’ చిత్రాన్ని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రంగా మార్చాయి. ఈ సినిమాతో యశ్ మరోసారి బాక్సాఫీస్ విధ్వంసం సృష్టించనున్నట్లు తెలుస్తోంది.
టాక్సిక్ ట్రైలర్ వేడుకలో రుక్మిణి వసంత్ స్పెషల్ అట్రాక్షన్.. చెప్పుల ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
సప్త సాగరాలు దాచే సినిమాతో దక్షిణాదిలో మరింత పాపులర్ అయిన హీరోయిన్ రుక్మిణి వసంత్. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత కాంతార 1 చిత్రంతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ మూవీ టాక్సిక్ సినిమాలో కీలకపాత్ర పోషిస్తుంది.
